Bengaluru rains: వర్ష బీభత్సం.. కారులో చిక్కుకుని ఏపీ మహిళ మృతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా గుర్తింపు

బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి.

Karnataka: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. కేఆర్ సర్కిల్ వద్ద భారీగా నీళ్లు నిలిచాయి. అక్కడ కారులో చిక్కుకుని ఏపీ(Andhra Pradesh)కి చెందిన భానురేఖ అనే మహిళ మృతి చెందింది.

మృతురాలిది కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు అని తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకోవాలనుకుంది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. తేలప్రోలు గ్రామంలోని తల్లిదండ్రులకి విషయం తెలియగానే బెంగళూరుకి బయలుదేరారు.

వారి కుటుంబానికి కర్ణాటక కొత్త సీఎం సిద్ధరామయ్య రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. బెంగళూరులో భానురేఖ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. కాగా, భారీ వర్షాలపై సిద్ధరామయ్య సమీక్ష నిర్వహించారు.

కేఆర్ సర్కిల్ లోని అండర్ పాస్ లో భారీగా నీళ్లు నిలవడంతో అందులో మరి కొందరు ఇరుక్కుపోయారు. వారిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. అనంతరం ఆసుపత్రికి తరలించాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

భారీ వర్షాలతో పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజులు వర్షాలు పడుతాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు బెంగళూరులో వాతావరణం మామూలుగానే ఉంది. అనంతరం ఒక్కసారిగా ప్రజలకు సర్‌ప్రైజ్ ఇస్తూ వర్షం కురిసిందని ఆ నగరానికి చెందిన పలువురు ట్విట్టర్ లో తెలిపారు. పలు చోట్ల చెట్టు కుప్పకూలాయి. ఓ పాత భవనం కూడా పడిపోయింది. శనివారం సాయంత్రం కూడా బెంగళూరులో భారీ వర్షం కురవడంతో దాదాపు 20 భారీ చెట్లు కుప్పకూలాయి.

IND-AUS 2nd ODI : వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. వరుణ గండంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ!

ట్రెండింగ్ వార్తలు