ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖ మహానగరంలో ఇప్పుడు అతిపెద్ద ఆధార్ సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని ద్వారకా నగర్ లో హోటల్ సరోవర్ పక్కన ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ప్రజలకు సేవలు అందించేందుకు సిధ్దమయ్యింది. జనవరిలో దీన్ని ఫ్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో ఆధార్ సేవలు అందించేందుకు అధికారులు సిధ్దం చేస్తున్నారు.
భారత ప్రభుత్వం, స్మార్ట్ షిప్ ప్రయివేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈకేంద్రాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వ ఆధార్ సంస్ధ ప్రతినిధులు సందర్శించారు. ఆధార్ కు సంబంధించి ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం 500 మందికి రోజుకు సేవలు అందించేందుకు 8 కౌంటర్లు ఉండగా… రోజుకు 1000 మందికి సేవలు అందించేలా మరో 8 కౌంటర్లు సిధ్ధం చేసారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద కౌంటర్ విజయవాడలో ఉండగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ప్రారంభం అవుతోంది.