ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు : చలి పెరుగుతోంది

  • Publish Date - February 11, 2019 / 01:07 AM IST

హైదరాబాద్ : మరలా చలి పెరుగుతోంది. రాత్రి వేళల్లో శీతలగాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారతం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆరు చోట్ల స్వల్పగా వర్షాలు కురిశాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో 06, రామగుండంలో 11, మెదక్‌లో 12, హన్మకొండలో 13, హైదరాబాద్‌లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.