Telangana Rains: హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతోంది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ తదితర ఏరియాల్లో వాన కురుస్తోంది. పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 11 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్ష సూచనతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
అటు తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న 5 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వానలు కొనసాగుతాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
జూలై 1- ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
మంగళవారం రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ములుగు, భద్రద్రా కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ వర్షం కురిసే అవకాశం. గంటలకు 30 నుంచి 40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం.
Also Read: కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌ను మళ్లీ పిలవబోతుందా? ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్న విచారణ.. ఇక వీటిపై ప్రశ్నలు
జూలై 2-ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్..
బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం. గంటలకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురులు గాలులు వీచే అవకాశం.
జూలై-3.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. గంటలకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.
జూలై 4.. సూచన- రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం.
జూలై 5.. సూచన – రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.