జమ్మూ : జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీగా మంచు కురుస్తుండడంతో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ప్రస్తుతం భారీగా మంచుకురుస్తోంది. జమ్మూ శ్రీనగర్‌లో ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. కార్లు..చెట్లు..ఇళ్లు..భారీగా మంచు పేరుకపోయింది. దీనితో అక్కడున్న వారు ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కనీసం బయటకు కూడా రాలేని పరిస్థితి. వచ్చినా..గుట్టలుగా గుట్టలుగా పేరుకపోయిన మంచు గడ్డలతో వాహనదారులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో అధికారులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. మంచును కరిగించడం కోసం అధికారులు పలు ప్రయత్నాలు చేపట్టారు. స్థానికులు కూడా చిన్న చిన్న మంటలు వేస్తున్నారు.