Telangana Rains : హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు వర్ష సూచన

ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.

Telangana Rains : ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. వచ్చే నాలుగు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్ద‌ప‌ల్లి, ములుగు, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. గురువారం నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల్, నారాయ‌ణ‌పేట్, సూర్యాపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో భారీ వ‌ర్షం కురిసింది.

రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  హైదరాబాద్‌లో గురువారం నాడు 35.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కోంది. రాబోయే రెండు రోజుల్లో నగరంలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read : Tirumala : మే 21 న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

ట్రెండింగ్ వార్తలు