Weather Forecast : తెలంగాణలో పెరిగిన చలి…రాగల 3రోజులు రాష్ట్రంలో వర్షాలు

తెలంగాణలో వాతావరణం చల్లబడింది.  రాత్రి అయ్యేసరికి చలిగాలులు తీవ్రత ఎక్కువగా వుంటోంది. రాష్ట్రంలో పశ్చిమ దిశ‌నుంచి కింది‌స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Weather Forecast

Weather Forecast :  తెలంగాణలో వాతావరణం చల్లబడింది.  రాత్రి అయ్యేసరికి చలిగాలులు తీవ్రత ఎక్కువగా వుంటోంది. రాష్ట్రంలో పశ్చిమ దిశ‌నుంచి కింది‌స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కోంది. మిగ‌తా‌చోట్ల పొడి వాతా‌వ‌రణం ఉంటుం‌దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

గత 24 గంటల్లో వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా తాండూర్‌, యాలాల్‌ జిల్లాల్లో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.