South West Monsoon : అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో చాలా భాగం మరియు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

South West Monsoon :  నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో చాలా భాగం మరియు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 2, 3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం & అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

రాబోయే 5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులలో విస్తారమైన  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈసమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాసం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కాగా…. అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు జూన్‌ 8 వ తేదీ లోగా తెలంగాణ  రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రుతుపవనాలు క్రమేపి  బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని జూన్ 8వ  తేదీ లోగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వారు వివరించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని  16 జిల్లాల్లో వానలు కురిసినట్లు  హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Also Read : Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్

ట్రెండింగ్ వార్తలు