Weather Report : తెలంగాణలోకి రేపు రుతుపవనాల రాక

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Weather Report :  రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగిలిన భాగాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడులో పూర్తి భాగం, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య & వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో రుతుపవనాలు రేపు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు వివరించారు.

నిన్న ఈశాన్య బంగాళాఖాతం నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఈరోజు ఈశాన్య బంగాళాఖాతం నుండి మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
ఈరోజు పశ్చిమ దిశ నుండి క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రము వైపుకి వీస్తున్నాయి.

ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని… రేపు, ఎల్లుండి తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ వర్షాలుకురుస్తున్న సమయంలో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30నుండి 40 కిమీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Also Read : Jubilee Hills Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు-టాటూ లా ఉండాలనే మెడపై కొరికాము-

ట్రెండింగ్ వార్తలు