Weather Forecast : తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని జిల్లాలలో వడగాలులు వీస్తుండగా, మరికొన్ని జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణకు పశ్చిమ…వాయువ్య దిశల నుంచి ఈరోజు కింది స్ధాయి గాలులు వీస్తున్నాయని అధికారులు వివరించారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు.
రాష్ట్రంలోని ఉత్తర ఈశాన్య,ఆగ్నేయ జిల్లాలలో ఈరోజు రేపు అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అదే సమయంలో కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆసమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులుకూడావీయవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Also Read : 10th exam result: రేపు ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స