10th exam result: రేపు ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

10th exam result: రేపు ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స

Ap 10th Results

10th exam result: ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుండి మే 9వరకు జరిగాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఫలితాలు జూన్ 4వ తేదీనే విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది.

10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

విజయవాడలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పదోతరగతి ఫలితాలను ఉదయం 11గంటలకు విడుదల చేస్తారని ఓ ప్రకటనలో విద్యాశాఖ వెల్లడించింది. కానీ ఉదయం 11గంటల సమయం దాటినప్పటికీ ఫలితాలు విడుదల కాకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిసేపటికి సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు వెల్లడి వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫలితాల విడుదల తేదీని మరోసారి ప్రకటిస్తామని అన్నారు. కాగా సోమవారం (జూన్6) పదవ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ బి. రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.