SBI Recruitment: ఎస్బీఐ అప్డేట్: ప్రిలిమినరీ పరీక్ష తేదీలు విడుదల.. ఎప్పటినుడంటే?
ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులకు(SBI Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

SBI Recruitment: SBI Junior Associate Preliminary Exam Dates Released
SBI Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు(SBI Recruitment) ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యింది. తాజాగా, ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను ప్రకటించింది.
ముఖ్యమైన తేదీలు:
* ప్రిలిమినరీ పరీక్షలు: 2025 సెప్టెంబర్ 20, 21, 27 తేదీలలో జరగనున్నాయి.
* కాల్ లెటర్: త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
* ఆంధ్రప్రదేశ్ లో పోస్టులు 310
* తెలంగాణలో పోస్టులు 250
* మిగిలిన పోస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో కేటాయించబడ్డాయి.
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2025 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ మూడు విభాగాల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్స్ పరీక్ష, ప్రాంతీయ భాషా పరీక్ష.