APPSC Agriculture Recruitment: రేపే లాస్ట్ డేట్.. ఏపీపీఎస్సీ అగ్రికల్చర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.40 లక్షల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్(APPSC Agriculture Recruitment) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

APPSC Agriculture Recruitment: Tomorrow is the last date to apply for APPSC Agriculture job posts
APPSC Agriculture Recruitment: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 అగ్రికల్చర్ పోస్టులను భర్తే చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా(APPSC Agriculture Recruitment) సెప్టెంబర్ 8వ తేదీతో అంటే రేపటితో ముగియనుంది. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Mega Job Mela: రేపే మెగా జాబ్ మేళా: 21 కంపెనీలు, 1442 ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ(అగ్రికల్చర్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,060 నుంచి రూ.1,40, 540 వరకు ఇస్తారు.