10th Results: నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
ఏపీలో నేడు (శనివారం) పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ విజయవాడలోని ఆర్అండ్‌బి కార్యాలయం భవనంలోని మీడియా పాయింట్‌లో ఈ ఫలితాలను మరికొద్దిసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) 10వ తరగతి పరీక్షలు...

10th Result
10th Results: ఏపీలో నేడు (శనివారం) పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ విజయవాడలోని ఆర్అండ్‌బి కార్యాలయం భవనంలోని మీడియా పాయింట్‌లో ఈ ఫలితాలను మరికొద్దిసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగాయి. అయితే గతంలో టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు.
ఏప్రిల్ 27న ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలను ఈసారి 6,22,537 మంది విద్యార్థులు రాశారు. పరీక్షా పేపర్లు సకాలంలో మూల్యాంకనంకోసం 20వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. దీంతో రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ పది పరీక్షల ఫలితాలు విడుల చేసేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) పది పరీక్ష ఫలితాలను వెలువడించనుంది. ఉదయం 11గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా
పదవ తరగతి పరీక్షా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన https://bse.ap.gov.in/ లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసి వెంటనే రిజల్ట్ లింక్ ను ఓపెన్ చేయాలి. తరువాత అక్కడ వచ్చే బ్లాంక్ బాక్స్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెన్త్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించలేదు. నేరుగా ఇంటర్ కు విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఈ ఏడాది కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది.