10th Exams: ప్రశ్నాపత్రం లీక్ వార్తలు అవాస్తవం: మంత్రి బొత్స

పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.

10th Exams: ప్రశ్నాపత్రం లీక్ వార్తలు అవాస్తవం: మంత్రి బొత్స

Botsa Satyanarayana

10th Exams: పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే, మొదటి రోజే తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు హిందీ ప్రశ్నాపత్రం కూడా లీకైందని మరో ప్రచారం మొదలైంది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. నంద్యాలలో ఒక క్లర్క్ కొంతమంది ఉపాధ్యాయులతో కుట్రపన్ని తెలుగు ప్రశ్నపత్రం జిరాక్స్ కాపీని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారని, అయితే దానివల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూశామన్నారు. ఎక్కడా కాపీయింగ్ జరగకుండా అడ్డుకోగలిగామని చెప్పారు. ఈ విషయంపై తొమ్మిది మందిపై విచారణ చేస్తున్నామన్నారు.

Andhra pradesh: వైద్యం వికటించి బాలింత మృతి

‘‘పేపర్ లీకేజికి సంబంధించి బుధవారం తిరుపతిలోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌ను, ఎన్ఆర్ఐ స్కూల్ స్టాఫ్ సుధాకర్‌ను అరెస్టు చేశాం. మరో నలుగురిని సస్పెండ్ చేశాం. ఈ రోజు హిందీ పేపర్ లీకైందని ప్రచారం జరిగింది. దానిలో కూడా నిజం లేదు. ఇదంతా నారాయణ సంస్థల ద్వారా ప్రభుత్వంపై చేస్తున్న కుట్రగా భావిస్తున్నా. ఈ విషయంలో నారాయణ స్కూల్‌కు ప్రమేయం ఉంది. కాబట్టి.. చంద్రబాబు, నారా లోకేష్ ఏం చెబుతారు. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇలా పరీక్షలపై దుష్ప్రచారం చేయడం తప్పు. విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేస్తే ఏమొస్తుంది. పిల్లల తండ్రిగా, విద్యాశాఖ మంత్రిగా చెబుతున్నా.. విద్యార్థులూ నిర్భయంగా పరీక్షలు రాయండి. ఈ పరీక్షలు మూడు గంటలపాటు జరుగుతాయి. అరగంట ఆలస్యం అయినా, ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతిస్తున్నాం. 26 పేజీల ఆన్సర్‌షీట్ ఇస్తున్నాం. ఆన్సర్‌షీట్లు బయట దొరుకుతున్నాయనే ప్రచారం నిజం కాదు’’ అని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స.