AP 10th Exams : ఏపీలో గాడితప్పిన టెన్త్ ఎగ్జామ్స్.. ఏకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే మాస్‌ కాపీయింగ్‌

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాస్‌ కాపీయింగ్‌లో భాగవుతున్నారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారం బయపడింది.

AP 10th Exams : ఏపీలో గాడితప్పిన టెన్త్ ఎగ్జామ్స్.. ఏకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే మాస్‌ కాపీయింగ్‌

Ap Ssc Exams

AP 10th Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణ గాడి తప్పింది. పరీక్షలు మొదలైన రోజు నుంచి.. నిన్నటి వరకూ ప్రశ్నాపత్రాలు లీకవగా.. ఇవాళ మాస్‌ కాపీయింగ్‌లు బయటపడ్డాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాస్‌ కాపీయింగ్‌లో భాగవుతున్నారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారం బయపడింది. ప్రకాశం జిల్లా, రాచర్ల జడ్పీ హైస్కూల్‌ ఎగ్జామ్‌ సెంటర్‌లో ఏకంగా.. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్లిప్పులు రెడీ చేశారు. ఎగ్జామ్‌ హాల్‌ పక్కనే ఉన్న ఓ రూమ్‌లో కూర్చొని.. పిల్లల కోసం పేరెంట్స్‌ కాపీలు రెడీ చేస్తూ కెమెరాకు చిక్కారు.

అటు.. కృష్ణా జిల్లాలో మాస్‌ కాపీయింగ్‌ కలకలం రేపింది. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న నలుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. పది పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందంటూ.. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. డోకిపర్రు జడ్పీ హైస్కూల్‌లో భారీగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని.. పసమర్రు జడ్పీ హైస్కూల్‌ నుంచి స్లిప్‌లను పంపినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

10th Question paper leak: చిత్తూరులో టెన్త్ పేపర్ లీక్ సూత్రదారి అరెస్ట్.. నంద్యాల కలెక్టర్ సీరియస్.. నలుగురిపై వేటు

దీంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు పసుమర్రు స్కూల్‌కు చేరుకున్నారు. పాఠశాలలోని పలువురు ఉపాధ్యాయులు వద్ద ఇవాళ జరుగుతున్నపరీక్షల ప్రశ్నలకు సెల్‌ఫోన్‌లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అటు.. డీఈవో తాహిరి సుల్తానా సైతం పసుమర్రు పాఠశాలకు చేరుకుని మాస్‌ కాపీయింగ్‌పై విచారణ చేపట్టారు.