10th Question paper leak: చిత్తూరులో టెన్త్ పేపర్ లీక్ సూత్రదారి అరెస్ట్.. నంద్యాల కలెక్టర్ సీరియస్.. నలుగురిపై వేటు

ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు....

10th Question paper leak: చిత్తూరులో టెన్త్ పేపర్ లీక్ సూత్రదారి అరెస్ట్.. నంద్యాల కలెక్టర్ సీరియస్.. నలుగురిపై వేటు

Exam Paper Leak

10th Question paper leak: ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. చిత్తూరులో పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సప్ లలో చక్కర్లు కొట్టింది. సమాచారం తెలుసుకున్న డీఈవో జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. తొలుత పేపర్ లీక్ కాలేదని, వందంతులు నమ్మొద్దని డీఈవో, కలెక్టర్ ప్రకటించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ పై విచారణ జరపగా.. తెలుగు పరీక్షా పేపర్ ను గరిధర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు వాట్సప్ గ్రూప్ లో షేర్ చేసినట్లు గుర్తించారు. దీంతో గరిధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గిరిధర్ రెడ్డి నారాయణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం చిత్తూరు వాట్సాప్ గ్రూప్ లలో తెలుగు పరీక్షా పత్రాలను పోస్ట్ చేయడంతో.. అసలు గంగిరెడ్డికి పేపర్లు ఎవరు పంపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Chittoor : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్

మరోవైపు నంద్యాల జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బాధితులపై చర్యలకు ఉపక్రమించారు. భవిష్యత్ లో జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని నలుగురు అధికారులపై కలెక్టర్ వేటు వేశారు. తొమ్మిది మంది టీచర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో నీలకంటేశ్వరరెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు రంగనాయకులు ఉన్నారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్, ప్లయింగ్ స్వ్కాడ్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే నంద్యాల జిల్లాలో జరిగింది పేపర్ లీక్ కాదని, కేవలం మాల్ ప్రాక్టీస్ అని విద్యాశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం.

వాట్సప్ లో టెన్త్ పరీక్ష పేపర్ చక్కర్లు …. పరీక్ష క్యాన్సిల్ …ముగ్గురు అరెస్ట్

అయితే రెండు ఏపీలోని రెండు జిల్లాల్లో టెన్త్ పేపర్ లీక్ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాట్సప్ గ్రూపుల్లోకి టెన్త్ పేపర్ ఎలా వచ్చింది, పరీక్ష ప్రారంభం తరువాత వాట్సప్ గ్రూపుల్లోకి వచ్చిందా? పరీక్ష ప్రారంభంకు ముందు వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చిందా అనేదానిపై విచారణ చేపట్టారు. మరోవైపు నంద్యాల జిల్లాలోనూ పేపర్ లీక్ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నారు. అసలు పేపర్ లీక్ అయిందా, మాల్ ప్రాక్టీస్ జరిగిందా అన్న కోణంలో వారి వద్ద నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తొలిరోజు టెన్త్ పరీక్షలో రెండు జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.