Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. 4 రోజులు వానలే వానలు..! ఈ జిల్లాలకు అలర్ట్..

తిరుపతి జిల్లా మల్లంలో 70 మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2 మిమీ..

Heavy Rains

Weather Updates: ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న నాలుగు రోజులు వానలు కురుస్తాయంది. దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

శుక్రవారం (19-09-25)
* ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
* కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి జిల్లా మల్లంలో 70 మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2మిమీ, యర్రగొండపాలెంలో 49.7 మిమీ, చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 49 మిమీ, కోనసీమ జిల్లా ఈతకోటలో 47 మిమీ వర్షపాతం నమోదైంది.