Rains Alert
Weather Updates: ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలలో వానలు పడతాయంది. ఆదివారం (12-10-25) అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాన కురుస్తున్నప్పుడు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
ఇక, చిత్తూరులో 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 31 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 26.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Also Read: 18వేల కిలోమీటర్లు, 21 రోజులు, 13 దేశాలు.. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే