మెగా ట్రీట్ రెడీ.. చిరు 152 ఫస్ట్‌లుక్, మోషన్ పోస్ట‌ర్ ఎప్పుడంటే..

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 04:53 PM IST
మెగా ట్రీట్ రెడీ.. చిరు 152 ఫస్ట్‌లుక్, మోషన్ పోస్ట‌ర్ ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెగాస్టార్ ఆగ‌స్ట్ 22న త‌న 65వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా అభిమానులకు చిరంజీవి పుట్టిన‌రోజు గిప్ట్‌ను అందిస్తున్నారు. ఆగ‌స్ట్ 22 సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : S. తిరు, సంగీతం : మణి శర్మ, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, ఎడిటింగ్ : నవీన్ నూలి.
Chiru 152