బిగ్గెస్ట్ బొంగు చికెన్ : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్

ఆంధ్రాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ (బాంబూ చికెన్)కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సాధించింది. 2018లో 10.5 మీటర్ల పొడవున్న ఆత్రేయపురం పూతరేకును తయారుచేసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 05:56 AM IST
బిగ్గెస్ట్  బొంగు చికెన్ : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్

ఆంధ్రాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ (బాంబూ చికెన్)కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సాధించింది. 2018లో 10.5 మీటర్ల పొడవున్న ఆత్రేయపురం పూతరేకును తయారుచేసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.

విజయవాడ  : ఆంధ్రా వంటల రుచుల పేరు చెబితే నోరూరిపోతుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఇలా ఏవైనా సరే ఆంధ్రా రుచులకు ఫిదా అవ్వాల్సిందే. ఏపీలోని ఒక్కో ప్రాంతంలోని ఒక్కో వంటకానికి ప్రత్యేకత ఉంది. వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆంధ్రాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ (బాంబూ చికెన్)కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సాధించింది. 2018లో 10.5 మీటర్ల పొడవున్న ఆత్రేయపురం పూతరేకును తయారుచేసి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.

 

ఇప్పుడు తాజాగా టూరిజం ఏరియా అయిన అరకులో స్పెషల్ డిష్ ఏది అంటే బొంగు చికెన్ అని ఇట్టే చెప్పేస్తారు. వెదురు బొంగులో వండే ఈ  బిర్యానీకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం చోటు దక్కింది. విజయవాడ భవానీపురంలోని హరిత బెర్మ్‌పార్క్‌ వేదికగా సోమవారం (ఫిబ్రవరి 18)న దేశంలోనే అతిపెద్ద బొంగు చికెన్‌ను తయారు చేసి రికార్డు సృష్టించారు. 15 అడుగుల పొడవైన బొంగులో.. చికెన్‌ వండి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. విశాఖకు చెందిన మారియట్‌ హోటల్‌ చెఫ్‌ల సహకారంతో బొంగు చికెన్‌ రూపుదిద్దుకుంది. గత ఏడాది అతిపెద్ద పూత రేకు, ప్రస్తుతం బొంగు చికెన్‌ వండి రికార్డుల్లోకి ఎక్కారు. 

 

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఏపీటీఏ ఈడీ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారేడుమిల్లి, అరకు, పాడేరు ప్రాంతాల్లోని విశిష్టమైన ఈ వంటకానికి గుర్తింపు తీసుకురావాలని..టూరిస్ట్ లకు..గెస్ట్ లకు  టేస్ట్ రుచి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చీఫ్ చెఫ్‌ రూపేశ్వరరావు పర్యవేక్షణలో ఆరుగురు చెఫ్‌లు 5 గంటలు కష్టపడి ఈ వంటకాన్ని తయారు చేశారని తెలిపారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ ప్రతినిధి శాంతన్‌ చౌహాన్‌ దీనిని పరిశీలించి అవార్డును అందజేశారు. ఇప్పటి వరకు 8 అడుగుల పొడవైన బొంగు చికెన్‌ తయారు చేశారని, ప్రస్తుతం 15 అడుగుల పొడవుతో తయారు చేసి రికార్డుల్లోకి ఎక్కినట్లు శాంతన్‌ చౌహాన్‌ తెలిపారు. 

 

విశాఖ ఏజెన్సీలోని అరకు లోయ నుంచి మారేడుమిల్లి వరకు గల పర్యటక ప్రాంతాల్లో బొంగు చికెన్ అందుబాటులో ఉండే ఈ బొంగు చికెన్ తయారుచేయడం  గిరిజనుల ప్రత్యేకత. వారిలో కొంతమందికి మాత్రమే ఈ బొంగు చికెన్ తయారు చేస్తారు. విశాఖను మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు, ఈ బొంగు బిర్యానీని రాష్ట్ర బ్రాండ్‌గా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. బొంగు బిర్యానీ అనగానే ఏపీయే గుర్తుకొచ్చేలా చేయలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం చెఫ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.