జగన్ మీకు కూడా అదే గతి పట్టిస్తాడు జాగ్రత్త

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 09:30 AM IST
జగన్ మీకు కూడా అదే గతి పట్టిస్తాడు జాగ్రత్త

సీఎం జగన్ కు వత్తాసు పలుకుతూ..ఆయన  తానా అంటే తందానా అంటూ తిరిగే అధికారులకు కూడా ప్రస్తుతం మాజీ సీఎస్ అధికారి సుబ్రహ్మణ్యానికి పట్టిన పరిస్థితే పడుతుందని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకోవాలనీ సూచించారు.

అలా కాకుండా అధికారంలో ఉండే సీఎంలకు..మంత్రులకు సలాములు చేసుకుంటూ ఉంటే ఎప్పటికైనా వారు కూడా తగిన శాస్తి అనుభవిస్తారనీ.. జగన్ వాడుకుని విసిరిపాడే వ్యక్తి..అటువంటి వ్యక్తికి సలాములు కొట్టుకుంటూ అధికారులు..పోలీసులు ఉంటే వారికి ఎప్పటికైనా ఫలితం అనువిస్తారని సూచించారు. అధికారులతో తనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ వారి అవరసం తీరాక వారిపైనే దాడులు చేయిస్తున్నాడనీ..ఆ విషయం ప్రతీ అధికారి గుర్తు పెట్టుకోవాలని సూచించారు చంద్రబాబు.  

మీ తోటి అధికారులతోనే మీపై దాడులు చేయించే వ్యక్తి జగన్ అనీ.. చంద్రబాబు అధికారులకు, పోలీసులకు సూచించారు. ఇటువంటి సీఎంకు అధికారులు అడుగులకు మడుగులు ఒత్తుతూ వ్యక్తిత్వాన్ని చంపేసుకుంటున్నారనీ ఇది మంచి పద్ధతికాదని తెలిపారు. 

సైకోగా తయారైన సీఎం జగన్ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ..రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని రాష్ట్ర ప్రజలు అధోగతి పాలు చేస్తున్నారనీ అన్నారు. మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రజలే కాకుండా మేధావులంతా కూడా వ్యతిరేకిస్తుంటూ తాను మాత్రం మూర్ఖత్వం వ్యవహరిస్తున్నాడనీ ఇటువంటి వ్యక్తి ఏపీకి సీఎం కావటం దురదృష్టకరమని చంద్రబాబు ఆరోపించారు.  మూడు రాజధానుల అంశాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారనీ సెమినార్లు పెట్టి మరీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనీ ఇది వైసీపీ ఫ్యాక్షనిజం పరిపాలను నిదర్శమని అన్నారు. మూడు రాజధానుల్ని వ్యతిరేకించినవారిపై తప్పుడు కేసులు బనాయిస్తు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.  

ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అష్టకష్టాలు పాలు చేయటం క్షమించరానిదనీ అన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదికాదని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు వస్తుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు. 
సీఎం జగన్ దద్దమ్మ పరిపాలతో పెట్టుబడుల్నింటినీ పక్క రాష్ట్రాలకు సాగనంపుతున్నారనీ..దాంట్లో భాగంగానే తమ ప్రభుత్వం కృషి చేసి ఏపీకి తీసుకొచ్చిన కియా మోటార్ కంపెనీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవటానికి సిద్ధమైందని విమర్శించారు.