సంయమనం పాటించాలని సీఎం జగన్ విజ్ఞప్తి

134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 10:27 AM IST
సంయమనం పాటించాలని సీఎం జగన్ విజ్ఞప్తి

134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన

134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం విదితమే. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం జగన్ విఙ్ఞప్తి చేశారు. అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలిపిన తర్వాతే ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ ఆయన విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్‌ చేశారు.

యూపీ రాష్ట్రం అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని (2.77 ఎకరాలు) రామజన్మ న్యాస్‌కే అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదే విధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు (సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించింది.

ఆయోధ్యను రాముడి జన్మభూమిగా భావిస్తారని, ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేదని చీఫ్ జస్టిస్ గొగొయ్ అభిప్రాయపడ్డారు. నమ్మకం, మత విశ్వాసాలు ఆధారంగా తీర్పు ఇవ్వలేమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవని చెప్పారు. న్యాయసూత్రాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ణయించాలన్నారు.

వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదన్న కోర్టు.. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయోధ్య ట్రస్ట్‌కు 3 నెలల్లోగా భూమిని అప్పగించాలని తీర్పు ఇచ్చింది ధర్మాసనం.