అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 08:17 AM IST
అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విజయనగరంలో ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రసంగించారు. ‘నేను రాజును కాదు…సామాన్యుడిని, జనం కోసమే బతుకుతా..వారి కోసమే చస్తా’ అని స్పష్టం చేశారు.

విజయనగరంలో బొత్స సత్యనారాయణ.. ఆయన కుటుంబ సభ్యులే ఉండాలా? అని పవన్ ప్రశ్నించారు. కుటుంబ నాయకత్వం పోవాలని, కొత్త నాయకత్వం రావాలని పవన్ ఆకాంక్షించారు. బుక్కా శ్రీనివాస్ ను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంచుతున్నానని.. ఆయన్ను గెలిపించాలని పవన్ కోరారు.
Read Also : అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుపైనా పవన్ విమర్శలు చేశారు. అశోక్ గజపతి రాజుకి, అల్లూరి సీతారామరాజుకి చాలా తేడా ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు ప్రజల కోసం అడవుల్లో తిరిగిన వీరుడు అన్నారు. అశోక్ గజపతి రాజు తన కోటకే పరిమితమైన పెద్ద అన్నారు. పవన్ ఎవరో తెలియదు అని అశోక్ గజపతి రాజు చాలాసార్లు చెప్పారని, అందుకు నేను బాధపడను అని పవన్ అన్నారు. మనం ఊడిగం చేసేవాళ్లం, పల్లకీలు మోసే వాళ్లం, మనల్ని గుర్తించకపోయినా పట్టించుకోను అని పవన్ అన్నారు.

అనుభవం ఉన్న వాళ్లని, పెద్దలను తాను గౌరవిస్తాను అని పవన్ చెప్పారు. విజయనగరం ఒక సంస్థానం అని,  బొబ్బిలి యుద్ధం జరిగిన ప్రాంతం అని, ఆత్మ గౌరవానికి చిహ్నం అని పవన్ చెప్పారు. అలాంటి చోట భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయాలను కొన్ని కుటుంబాలకు పరిమితం చేస్తున్నారని టీడీపీ, వైసీపీలపై పవన్ మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే విజయనగరం సంస్థానం గౌరవాన్ని నిలబెడతా అని పవన్ చెప్పారు. బొత్స సత్యనారాయణ బెల్ట్ షాపులను పీకేసి దేశభక్తి ప్రాంగణాలుగా మారుస్తా అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతి ఒక్క రూపాయిని వెనక్కి ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు.
Read Also : పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు