ఇంటి అద్దె కట్టడానికి డబ్బుల్లేని స్థితి నుంచి యూఎస్ ఆర్మీ ఫస్ట్ సీఐఓగా ఇండియన్-అమెరికన్

ఇంటి అద్దె కట్టడానికి డబ్బుల్లేని స్థితి నుంచి యూఎస్ ఆర్మీ ఫస్ట్ సీఐఓగా ఇండియన్-అమెరికన్

US Army first CIO: ఇండియన్-అమెరికన్ డా. రాజ్ అయ్యర్ యూఎస్ ఆర్మీ ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా ఘనత సాధించాడు. పెంటగాన్ క్రియేట్ అయిన జులై 2020లోనే అతనికి ఈ పొజిషన్ క్రియేట్ అయింది.
అత్యధిక ర్యాంక్ ఉన్న యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్-అమెరికన్ పౌరుల్లో మిస్టర్ అయ్యర్ ఒకరు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్‌డీ చేశారు. సెక్రటరీ ఆఫ్ ద ఆర్మీ ప్రిన్సిపల్ అడ్వైజర్ గా పెంటగాన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఎంపికయ్యారు.
చైనా, రష్యా పీర్ అడ్వర్సరీస్ లో డిజిటల్ ఓవర్ మ్యాచ్ సాధించాలనే యూఎస్ ఆర్మీ ప్రయత్నిస్తుంది. దీని కోసం పాలసీలను ఎగ్జిక్యూషన్ చేసేందుకు అయ్యర్ సూచనలు ఇవ్వనున్నారు.
యూఎస్ ఆర్మీలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ అయినటువంటి క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లలో క్రిటికల్ స్ట్రాటజీలు వాడనున్నారు. మల్టీపుల్ డొమైన్ ఆపరేషన్స్‌తో ఫ్యూచర్ వార్ ఫైటింగ్ కాన్సెప్ట్ ను బలోపేతం చేయాలని అనుకుంటున్నారు.
గతంలో అయ్యర్.. డెలాయిట్ కన్సల్టింగ్ ఎల్ఎల్పీకి పార్టనర్ గానూ మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించారు. సపోర్టింగ్ గవర్నమెంట్ క్లెయింట్ల కోసం మల్టీపుల్ టెక్నాలజీ ప్రోగ్రాంలకు లీడ్ గా వ్యవహరించారు.
అతని 26ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్ లో.. డిఫెన్స్, కమర్షియల్ క్లెయింట్లకు సపోర్ట్ చేశారు. స్ట్రాటజీ, ఇన్నోవేషన్, మోడరనైజేషన్ లలో ఛాలెంజెస్ విజయవంతంగా ఎదుర్కొన్నారు. టెక్నాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పొందిన ఆయన.. మిచిగాన్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశారు.
అయ్యర్ తమిళనాడులోని తిరుచాపల్లికి చెందిన వ్యక్తి. బెంగళూరులో పెరిగిన ఆయన.. తిర్చి ఎన్ఐటీలో చదువుకుని ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిపోయారు. ట్యూషన్ ఫీజుకు అక్కడ ఉండటానికి అద్దె డబ్బులు కూడా సరిపోలేని పరిస్థితి నుంచి ఈ స్థాయికి ఎదిగారు.