మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట

  • Edited By: vamsi , March 14, 2019 / 02:33 AM IST
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట

మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10గంటలు దాటిన తరువాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేశారంటూ గతంలో గుంటూరు అరండల్‌పేటలో కేసు నమోదు కాగా ఆ కేసులో చిరంజీవికి ఊరట లభించింది. ఈ విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసుని కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజని విచారణ జరిపి, చిరంజీవి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా అక్రమంగా కేసు బనాయించారంటూ చిరంజీవి తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసును రద్దు చేస్తూ తీర్పును ఇచ్చారు.
Read Also : యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమరశంఖం