కేసుల భయంతో హోదాను తాకట్టుపెట్టారు : చంద్రబాబుపై ఆగ్రహం

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 06:42 AM IST
కేసుల భయంతో హోదాను తాకట్టుపెట్టారు : చంద్రబాబుపై ఆగ్రహం

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కేసుల భయంతో ప్రత్యేక హోదా  రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగి  ఉండేదన్నారు.

చంద్రబాబు నిర్వాకం వల్ల ప్రత్యేక హోదా రాకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అన్నది చంద్రబాబు కాదా? అని జగన్ ప్రశ్నించారు. మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార  సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశారని జగన్ ఫైర్ అయ్యారు. హోదా వద్దు ప్యాకేజీ చాలు అంటూ కేంద్రంతో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని జగన్ ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీపడ్డాను అని చెప్పింది చంద్రబాబు కాదా? అని జగన్ నిలదీశారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు

ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచన చెయ్యాలని జగన్ కోరారు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి లోకేష్ ను ఓడించాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలన్నారు. వైసీపీ అభ్యర్థి ఆర్కేని గెలిపిస్తే.. ప్రజలకు అండగా ఉంటారని, కేబినెట్ లో మంత్రిగా ఉంటారని జగన్ చెప్పారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను చంద్రబాబు దగా చేశారని జగన్ ఆరోపించారు. వైసీపీని గెలిపిస్తే ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24వేలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని, సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తీసుకొస్తామన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ అభ్యర్థించారు.
Read Also : మైలవరానికి రూ.100 కోట్లు.. మంగళగిరికి రూ.200 కోట్లు పంపారు