900 ఏళ్ల క్రితమే బాటా చెప్పులు వాడారా?

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 07:16 AM IST
900 ఏళ్ల క్రితమే బాటా చెప్పులు వాడారా?

తమిళనాడుకు చెందిన  గోపాల్ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 900 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ పురుషులు బాటా కంపేనీ చెప్పులని పోలీ ఉన్న చెప్పులు వాడారని తన ట్విటర్ లో ఓ శిల్పం ఫోటో షేర్ చేశాడు. 

అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడులోని అవుదయార్ కోయిల్ ఆలయంలో ఓ శిల్పం చెప్పులు ధరించి కనిపించింది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం కూడా మనవాళ్లు ఇంతా ఫ్యాషన్ గా ఉన్నారా.. అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులోని శిల్పం నిజంగానే ప్రస్తుత బాటా కంపెనీ తయారు చేసే చెప్పులను పోలి ఉంది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. అప్పటి రోజుల్లోనే ఇంత స్టైల్ గా ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కావాలంటే ఫోటోను జూమ్ చేసి చూడండి అని తన క్యాప్షన్ పెట్టాడు. గోపాల్ ట్వీట్ పై స్పందించిన ఓ యూజర్ 1400 సంవత్సరాల క్రితమే స్త్రీలు హీల్స్ వేసుకున్నారు. కంచిలోని కైలాసనాథర్ ఆలయంలోని ఓ శిల్పంలో హీల్స్ ధరించిన ఫోటోను షేర్ చేశాడు.