ఎమోషనల్ వీడియో: క్యాన్సర్ రోగి కోసం బ్యాట్‌మెన్‌గా మారిన డాక్టర్

10TV Telugu News

చిన్న పిల్లల్లో బ్యాట్‌మెన్, సూపర్‌మెన్, స్పైడర్ మ్యాన్ ఇలా తెరమీద కనిపించే హీరోలపై ఉండే ఇష్టం చాలా ఎక్కువ. కొందరు వారిని ఒక్కసారైనా కలవాలి అని భావిస్తూ ఉంటారు. అయితే తెరపై కనిపించే హీరోలు నిజజీవితంలో రాలేరు. అవి వేషాలు అని తెలియని ఓ చిన్నారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చివరి రోజుల్లో చిన్నారి బతికేది కొన్ని రోజులే అని కూడా తెలియదు.అయితే రోజులు లెక్కబెడుతున్న చిన్నారి చివరి కోరిక ఏంటో తెలుసుకుని నెరవేర్చాలని భావించాడు ఓ డాక్టర్. చిన్నారి కోరికను తీర్చేందుకు డాక్టరే బ్యాట్‌‌మెన్‌గా‌ మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫీల్‌ గుడ్‌ అనే ట్విటర్‌ అకౌంట్ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తుంది.


అమెరికాలోని నార్త్‌ డకోటాకు చెందిన డాక్టర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి కోసం‌ బాట్‌మెన్‌‌ వేషం​ వేశాడు. అంతకుముందు పిల్లాడికి బ్యాట్‌మెన్ అంటే ఇష్టం అని తెలుసుకున్న డాక్టర్.. పిల్లవాడి కోసం ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు. బ్యాట్‌మెన్‌ను‌ కలవాలన్న కోరికను బ్యాట్‌మెన్‌‌ దుస్తులు ధరించి ఆస్పత్రి కారిడార్‌లో చిన్నారికి ఎదురుగా వచ్చి నెరవేర్చాడు. చిన్నారిని దగ్గరకు పిలిచి హత్తుకొని, నిన్ను ఇబ్బంది పెడుతున్న మహమ్మారితో ధైర్యంగా పోరాడు అంటూ ధైర్యం నింపాడు.

10TV Telugu News