7,500 మైళ్లు దాటొచ్చిన వలస పక్షి.. సైంటిస్టులే ఆశ్చర్యపోయారు!

  • Published By: dharani ,Published On : May 27, 2020 / 10:49 AM IST
7,500 మైళ్లు దాటొచ్చిన వలస పక్షి.. సైంటిస్టులే ఆశ్చర్యపోయారు!

సాధారణంగా పక్షులలో రెండురకాలు.. అవేంటంటే వలస పక్షులు, స్థానిక పక్షులు. స్థానిక పక్షులు అవి పుట్టిన ప్రాంతంలోనే జీవితాంతం ఉండిపోతాయి. వలస పక్షులు ముఖ్యంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వందల నుంచి వేల కిలోమీటర్లు వలస పోతుంటాయి. ముఖ్యంగా పక్షుల వలసలు చలికాలంలో శీతల ప్రాంతమైన ఉత్తరం నుంచి ఉష్ణ ప్రాంతమైన దక్షిణం వైపుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వలసపోయే పక్షి జాతుల సంఖ్య వేలల్లో ఉంటుంది.

తాజాగా శాటిలైట్ ట్యాగ్ ఉపయోగించి.. శాస్త్రవేత్తలు దక్షిణ ఆఫ్రికా నుండి 7వేల500 మైళ్ళు (12వేల కిలోమీటర్లు) కంటే ఎక్కువ వేగంతో మంగోలియాలోని దాని సంతానోత్పత్తి ప్రదేశానికి ప్రయాణించిన ఒక వలస పక్షిని పర్యవేక్షించారు. ఈ పక్షి సంతానోత్పత్తి తరవాత పిల్లలను పెద్ద చేసుకుని తిరిగి వెళ్లిపోతోంది. ఇది వేగం గంటకు రెండువారాల్లో 10వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుందని చెప్పారు. ఎంత వేగంతో వెళ్తుందో అంతే కచ్చితత్వంతో చూడగలదని చెప్పారు. ఈ పక్షి 16 దేశాలను దాటిన తరువాత సముద్రపు క్రాసింగ్‌లు మరియు అధిక గాలులతో బయటపడింది.

శాస్త్రవేతలు మముత్ జర్నీ అని పిలుస్తారు. మంగోలియన్ నది పేరు మీద ఒనాన్ అనే శాటిలైట్ ట్యాగ్ చేసిన సాధారణ కోకిల మార్చి 20న జాంబియాలోని శీతాకాలంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మంగోలియాలో గత వేసవిలో మంగోలియా కోకిల ప్రాజెక్ట్ చేత ట్యాగ్ చేయబడిన 5కోకిలలో ఒనాన్ ఒకటి అని చెప్పారు. ఈ పక్షి హిందూ మహాసముద్రం వేలాది కిలోమీటర్లు దాటకుంటూ.. దగ్గరదగ్గర గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ.. కెన్యా, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ప్రయాణించింది.

అయితే శాటిలైట్ ట్యాగింగ్ ప్రాజెక్ట్ సుదూర వలసల గురించి చాలా వెల్లడించిందని BTO డాక్టర్ క్రిస్ హ్యూసన్ చెప్పారు. ఇక ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితికి వస్తే కరోనా వల్ల అందరం దూరప్రయాణాలు మానేసాము, సోషల్ డిస్టాన్స్ పాటిస్తు.. చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. మరి ఈ పక్షులకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వాటంతటవే సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ ఉంటాయి.