ది బస్ బ్రదర్: తమ్ముడి కోసం రోజుకో కొత్త అవతారం 

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 11:43 AM IST
ది బస్ బ్రదర్: తమ్ముడి కోసం రోజుకో కొత్త అవతారం 

సాధారణంగా ఏ ఇంట్లో అయినా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటునే ఉంటారు. కానీ, ఈ అన్నాదమ్ముల మాత్రం చాలా డిఫరెంట్.. ఒకరిమీద ఒకరికి ఎంత ప్రేమ ఉంటోందో చూస్తే షాక్ అవుతారు. వీళ్లని చూస్తే.. అన్నదమ్ముల అనుబంధం అంటే ఏంటో తెలుస్తోంది.

తమ్ముడు ‘మాక్స్’ అంటే అన్న ‘నోహ్ టింగిల్’కి ప్రాణం. అతన్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేడు. తమ్ముడు స్కూల్ కు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో నోహ్ టింగిల్ బస్ స్టాప్ దగ్గర మాక్స్ కోసం రోజుకో కొత్త అవతారంలో కనబడుతుంటాడు. అతన్ని చూసి తమ్ముడు చాలా సంతోషంగా నవ్వుతూ.. వచ్చి హగ్ చేసుకుంటాడు. 

మాక్స్ బస్ లో నుంచి దిగడమే.. ఆలస్సం వెంటనే నోహ్ టింగిల్ ని హగ్ చేసుకుని.. కొడుతుంటాడు. ఇక కాసేపు అక్కడే గార్డెన్ లో ఒకరిని ఒకరు కొట్టుకుంటూ.. ఆడుకుంటారు. ఇలా ప్రతిరోజు మాక్స్  సంతోషం కోసం నోహ్ టింగిల్ శాంటా క్లాజ్ దుస్తుల నుండి అగ్నిమాపక సిబ్బంది, ఫుట్‌బాల్ ప్లేయర్ యూనిఫాం, గాలితో కొట్టి గొరిల్లా సూట్ ఇలా చాలా రకాల దుస్తులను ధరించి అతన్ని ఆశ్చర్యపరిచేవాడు.

అయితే నోహ్ టింగిల్ వేసుకున్న ప్రతీ డ్రస్సింగ్.. ఇంకా తన సోదరుడు మాక్స్ తనని చూసిన వెంటనే పడే సంతోషం అంతా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అందరూ వీరికి ‘ది బస్ బ్రదర్స’ అని పేరు పెట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.