Bihar: ఫేస్బుక్, ఇన్‌స్టా ఎక్కువగా వాడుతున్నావంటూ అత్తమామలు అభ్యంతరం.. భర్తను వదిలేసి వెళ్లిన మహిళ
15 రోజుల క్రితం ఇలియాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆమెకు అత్తింటి వారి నుంచి ఎదురైన వ్యతిరేకతను ఇంట్లో చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సబా సోదరుడు.. ఇలియాస్‌పై రివాల్వర్‌తో గురిపెట్టి బెదిరించాడు. అనంతరం ఇలియాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వధువు సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

FB and Instagram Addiction: సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వారు చాలా ఎక్కువ మందే ఉంటారు. వాస్తవానికి ప్రంపచాన్ని అరచేతిలోకి తీసుకువచ్చింది సోషల్ మీడియానే అయినప్పటికీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అడిక్షన్ లాగ మారిపోతే అది కూడా ప్రమాదాలనే కొని తెస్తుంది. ఇలాంటి ఘటనే ఒక బిహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీహార్‌లోని హాజీపూర్‌లో కొత్తగా పెళ్లయిన ఓ మహిళ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాంకు బాగా వాడుతోందంటూ అత్తమామలు అభ్యంతరం చెప్పడంతో భర్తను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఆ మహిళ పేరు సబా ఖాతూన్. 15 రోజుల క్రితం ఇలియాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆమెకు అత్తింటి వారి నుంచి ఎదురైన వ్యతిరేకతను ఇంట్లో చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సబా సోదరుడు.. ఇలియాస్‌పై రివాల్వర్‌తో గురిపెట్టి బెదిరించాడు. అనంతరం ఇలియాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వధువు సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనను పోలీసులకు సబా అత్తమామలు వివరించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు బానిసైందని, రోజంతా మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుందని చెప్పారు.
సబా ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడంపై ఇలియాస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ సంఘటన గురించి సబా తన తల్లిదండ్రులు, సోదరుడికి ఫిర్యాదు చేయడంతో గొడవ మరింత తీవ్రమైందని అన్నారు. గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, కుటుంబ సభ్యులను తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే సబా తల్లిదండ్రులు చెప్పిన విషయం మరోలా ఉంది.
పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటులో తన కుమార్తె మొబైల్ ఫోన్‌ను ఆమె అత్తమామలు లాక్కున్నారని, ఆమె తన కుటుంబంతో మాట్లాడటానికి కూడా అనుమతించలేదని సబా తల్లి రజియా ఖాన్ ఆరోపించారు. ఇంత తతంగం అనంతరం తన భర్త సహా అత్తమామల నుంచి విడిపోవాలనుకుంటున్నట్లు పోలీసులకు సబా చెప్పింది. ఆమె తన ఫోన్‌ను వదులుకోవడానికి ఇష్టపడలేదని కూడా పోలీసులు తెలిపారు. తరువాత, సబా తన కుటుంబంతో కలిసి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిందని పోలీసులు తెలిపారు.