ప్రతి ఫ్రెండ్ అవసరమేరా : ఎలక్షన్స్ ఓవర్..ఫ్రెండ్ షిప్ ఫరెవర్

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 04:26 AM IST
ప్రతి ఫ్రెండ్ అవసరమేరా : ఎలక్షన్స్ ఓవర్..ఫ్రెండ్ షిప్ ఫరెవర్

దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి,మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలతో నాయకులు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ ఒకటై పోతారు.కానీ వారి కోసం అప్పటివరకు కొట్టుకున్న కార్యకర్తలు,అభిమానులు నాయకల మాదిరిగా మారిపోలేరు.వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కొందరూ తమ ఫ్రెండ్ షిప్ ని తమ అభిమాన పార్టీ కోసం చెడగొట్టుకుంటారు.ఇంట్లో వాళ్ల కన్నా తమకు పార్టీనే ముఖ్యం అనుకుంటారు.చివరకు నాయకులు బాగానే ఉంటారు.మధ్యలో ఉన్న అభిమానులు,కార్యకర్తలు మాత్రమే బలి అయిపోతుంటారు. అయితే ఏ పార్టీలో ఉన్న మనమందరం ఫ్రెండ్స్, ఎన్నికల వరకే రాజకీయాలు అంటూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేరళలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.అయితే తాము గతంలోలానే ఇప్పుడు కూడా కలిసి ఉన్నామంటూ కొందరు యువకులు కారు లోపల,వెనుక డిక్కీలో కూర్చొని కాంగ్రెస్,బీజేపీ,సీపీఐ,సీపీఎం జెండాలు పట్టుకుని కూర్చుని ఢిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీ కారణంగా తమ ఫ్రెండ్ షిప్ చెదిరిపోదని తెలిపారు.ఈ ఫొటో ఇప్పుడు వాట్సాప్,ట్విట్టర్,ఫేస్ బుక్ ఇలా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే ఇదేనని,ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ ఫొటోపై సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.నాయకులు బాగానే ఉంటారు మనలో మనమే వాళ్ల కోసం కొట్టుకుని చనిపోతాం..ఈ ఫొటో చూసి అయినా ఇకపై మార్పు వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజమైన ఇన్ క్రెడిబుల్ ఇండియా అంటే ఇదే,ఎన్నికలు ముగిశాయి కానీ ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ ముగియదు అంటూ ఫొటోను షేర్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.