రైతు బిడ్డ రికార్డ్ : 7 బంతుల్లో 7 సిక్స్‌లు
క్రికెట్ చరిత్రలో ఇది ఓ అరుదైన రికార్డు. అసాధ్యం అనుకున్న రికార్డును సాధ్యం చేశాడు ఓ ముంబై కుర్రాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) నిర్వహించిన టైమ్స్ షీల్డ్ టోర్నమెంట్లో మార్కెండ్ పాటిల్ అనే 23ఏళ్ల కుర్రాడు ఏడు బంతులలో ఏడు సిక్స్‌లను కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. ముంబైలోని సచిన్ టెండూల్కర్ జింఖానా గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ ఈ రికార్డు సృష్టించాడు.
వివా సూపర్ మార్కెట్.. మహింద్రా లాజిస్టిక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 8వ నంబరు బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన పాటిల్.. ఒక ఓవర్లో ఆరు బంతులను పెవిలియన్ పంపి ఆరు సిక్స్‌లు నమోదు చేశాడు. తర్వాత ఓవర్లో కూడా వచ్చిన తొలి బంతిని సిక్స్‌గా మలవడంతో మార్కెండ్ పాటిల్ ఈ ఘనత సాధించాడు. 26 బంతుల్లో ఏకంగా 84 పరుగులు చేసిన పాటిల్ మహారాష్ట్రకు చెందిన ఓ సామాన్య రైతు బిడ్డ కావడం విశేషం.
Far in one corner of Mumbai. Virar boy slams seven sixes in seven balls. pic.twitter.com/r7baXVujXu
— Devendra Pandey (@pdevendra) 26 March 2019