Vande Bharat Metro : ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్ చూశారా? జూలై నుంచే ట్రయల్ రన్!

Vande Bharat Metro : పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో మొదటి కొన్ని కోచ్‌లను నిర్మించింది.

Vande Bharat Metro : ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్ చూశారా? జూలై నుంచే ట్రయల్ రన్!

Vande Bharat Metro (Image Source : Twitter/Google)

Vande Bharat Metro First Look : దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే మెట్రో రైలు వచ్చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రోరైలును నిర్మించారు. త్వరలో ‘మేడ్ ఇన్ ఇండియా’ వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ఈ మెట్రో రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.

Read Also : New Vande Bharat Express Trains : త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఈ వీడియోలో ఫ్యాక్టరీ లోపల వందే మెట్రో రైలును చూడవచ్చు. అమృత్ భారత్ తర్వాత దేశంలో త్వరలో వందే భారత్ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అతి త్వరలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. అనుకున్నట్లుగానే జూలై నెలలో ఈ ట్రయల్ రన్ అమలు చేసేందుకు రైల్వేశాఖ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.

16 కోచ్‌ల వరకు విస్తరించే అవకాశం :
పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో మొదటి కొన్ని కోచ్‌లను నిర్మించింది. మొదట్లో ఇలాంటి 50 రైళ్లను నిర్మిస్తామని, క్రమంగా వాటి సంఖ్యను 400కి పెంచుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. పరిధి పరంగా వందే భారత్ మెట్రో 100 కి.మీ నుంచి 250 కి.మీల మధ్య ప్రయాణించగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతానికి డిఫాల్ట్ కాన్ఫిగరేషన్‌గా 12 కోచ్‌లను కలిగి ఉంది. 16 కోచ్‌ల వరకు విస్తరించే అవకాశం ఉంది. భద్రతను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 నుంచి అనేక సంస్కరణ కార్యక్రమాలు చేపట్టామని రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అత్యాధునిక ఫీచర్లతో వందే భారత్ :
భద్రతకు సంబంధించి పనులకు ప్రత్యేక నిధి, మానవరహిత లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు, ట్రాక్ పునరుద్ధరణపై ఎక్కువ దృష్టి పెట్టడం, సురక్షితమైన ప్యాసింజర్ కోచ్‌ల ట్రాక్, హై స్పీడ్ ఆధునీకరించడం వంటివి ఉన్నాయి. వందే మెట్రో రైలులో ప్రయాణికులు అనేక అధునాతన సర్వీసులను పొందనున్నారు. దాంతో, రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఇందులో ఏసీ కోచ్‌లతో పాటు ఆటోమేటిక్ డోర్లు, ఎమర్జెన్సీ అలారం సిస్టమ్‌ను కూడా అందించనున్నారు.

వందే మెట్రో 160 కి.మీ వేగం :
భారత్‌లో నగరాల మధ్య రవాణా అవసరం ఉన్న మార్గాల్లో ఈ వందే మెట్రో నడుపనున్నారు. 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ మెట్రో రైలు సాధారణంగా 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ట్రయల్ వర్క్ పూర్తయితే.. జూన్-జూలై మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Read Also : Hyderabad Metro : రాయితీలు రద్దు చేసిన మెట్రో యాజమాన్యం