New Vande Bharat Express Trains : త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది....

New Vande Bharat Express Trains : త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Vande Bharat Express Train

New Vande Bharat Express Trains : దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – పూణే మార్గంలో కొత్తగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-పూణే మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది.

ALSO READ : New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు…నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష

దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-పూణే వందేభారత్ రైలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాల్ోల నాలుగు వందేభారత్ రైళ్లను నడుపుతోంది. వందేభారత్ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో వీటి సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యం ఏర్పడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

ALSO READ : Pregnant : బీహార్ మహిళ కు.ని. ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి గర్భం దాల్చింది…

ఇప్పటి వరకు మొత్తం 33 రైళ్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 33 వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాలు,రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఇప్పటి వరకు ఏ ఇతర రైళ్లలోనూ లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉండడం వల్ల వీటి ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఈ రైళ్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సేవలను విస్తరించాలని నిర్ణయించింది.

ALSO READ : Onion Price : తగ్గిన ఉల్లి ధరలు…మహారాష్ట్ర ఉల్లి కిలో ధర రూ.10

సికింద్రాబాద్-పూణే వందేభారత్ రైలుతోపాటు, వరణాసి-లక్నో, పాట్నా-జల్పాయిగురి, మడ్గావ్-మంగళూరు, ఢిల్లీ-అమృతసర్, ఇండోర్-సూరత్, ముంబయి-కొల్హాపూర్, ముంబయి-జల్నా, పూణే-వడోదర, టాటానగర్-వరణాసి సెక్షన్ల మధ్య కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వేశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.