Pregnant : బీహార్ మహిళ కు.ని. ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి గర్భం దాల్చింది…

ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ముజఫర్ పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ గైఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2015వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.....

Pregnant : బీహార్ మహిళ కు.ని. ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి  గర్భం దాల్చింది…

Bihar woman pregnant

Pregnant : ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ముజఫర్ పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ గైఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2015వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఈమె భర్త హర్యానాలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ మహిళ ఆర్థిక పరిమితుల కారణంగా ఎక్కువ మంది పిల్లలు వద్దనుకొని కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.

ALSO READ : Onion Price : తగ్గిన ఉల్లి ధరలు…మహారాష్ట్ర ఉల్లి కిలో ధర రూ.10

తాను కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెండు సార్లు గర్భం దాల్చాలని మహిళ తెలిపింది. మళ్లీ మూడోసారి తాను గర్భం దాల్చానని పేర్కొంది. దీంతో వైద్యులు గర్భవతిని పరీక్షించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక గర్భం దాల్చడంతో 2018వ సంవత్సరంలో జిల్లా మెజిస్ట్రేట్ ఆ మహిళకు పరిహారంగా ఆరు వేల రూపాయలు ఇచ్చారు.

ALSO READ : IPL 2024 auction : ఐపీఎల్ 2024 వేలం కోసం 333 మంది ఆటగాళ్లు

తనకు చేసిన కుటుంబనియంత్రణ ఆపరేషన్ విఫలమైనందున వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్యకేంద్రం ఇన్‌ఛార్జ్‌ సివిల్‌ సర్జన్‌ తెలిపారు.