ఇంటర్ మంటలు : కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 07:11 AM IST
ఇంటర్ మంటలు : కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు దిగింది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ దగ్గర విజయశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనుమతి లేదంటూ ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఫోన్ చేసి అడిగితేనే సమస్యలు పరిష్కారం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ లకు.. 20 మంది విద్యార్ధులు చనిపోతే కనిపించలేదా అని ప్రశ్నించారామె. సీఎం స్పందించటానికే ఐదు రోజులు పట్టిందా అని నిలదీశారు. ఇంటర్ పేపర్స్ కరెక్షన్స్ ను గ్లోబరీ సంస్థ కు కట్టబెట్టారని.. అధికార పార్టీకి చెందిన కీలక నేత స్నేహితుడు కాబట్టే ఆ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.

ఇంటర్ బోర్డ్ అధికారులు నిర్వాకంతో రాష్ట్రంలో 19మంది విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలనీ.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. విద్యార్థులకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఆవరణలో ప్రశాంతంగా ధర్నా చేస్తున్న తమను అన్యాయంగా అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు. పిల్లలకు జరిగిన అన్యాయంపై అడగటానికి వస్తే.. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
Also Read : సీఎం చంద్రబాబే.. పవర్ మాత్రం లేదు : సీఎస్ వ్యాఖ్యల కలకలం