సల్మాన్ ‘దబాంగ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా 'దబాంగ్' సిరీస్‌ను మరోసారి చేయనున్నాడు. సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం దబాంగ్ 2.

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 05:30 AM IST
సల్మాన్ ‘దబాంగ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ‘దబాంగ్’ సిరీస్‌ను మరోసారి చేయనున్నాడు. సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం దబాంగ్ 2.

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ‘దబాంగ్’ సిరీస్‌ను మరోసారి చేయనున్నాడు. సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం దబాంగ్ 2. ఇప్పుడు అదేవిధంగా దబాంగ్ 2కు సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం దబాంగ్ 3. ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సినిమాలో అస్లాం ఖాన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. 

ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఇక వీరితో పాటు ప్రముఖ తెలుగు కమెడియన్ అలీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 21, 2019 న విడుదల కానుంది. మరి హరీష్ ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ను ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.
Also Read : తెలుగు, తమిళ్ లో రకుల్ కి తగ్గుతోన్న అవకాశాలు