ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న జంతువులు ఇవే

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేసింది.ప్రజలకు విడతవారీగా వ్యాక్సిన్ వేస్తున్నారు. కొన్ని రకాల జంతువులకు కూడా కరోనా మహమ్మారి సోకింది. మరి వీటికి వ్యాక్సిన్ వేయరా? అంటే వేస్తారు...మరి మొదటిసారిగా ఏ జంతువులకు కరోనా వ్యాక్సిన్ వేశారో తెలుసా? అవి ఏవంటే...కాలిఫోర్నియాలోని శాండియాగో జూలో ఉండే ‘ఏప్స్’కి కరోనా వ్యాక్సిన్ వేశారు..!

ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న జంతువులు ఇవే

Covid Vaccination at animals : కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేసింది.ప్రజలకు విడతవారీగా వ్యాక్సిన్ వేస్తున్నారు. కొన్ని రకాల జంతువులకు కూడా కరోనా మహమ్మారి సోకింది. మరి వీటికి వ్యాక్సిన్ వేయరా? అంటే వేస్తారు…మరి మొదటిసారిగా ఏ జంతువులకు కరోనా వ్యాక్సిన్ వేశారో తెలుసా? అవి ఏవంటే…కాలిఫోర్నియాలోని శాండియాగో జూలో ఉండే ‘ఏప్స్’కి కరోనా వ్యాక్సిన్ వేశారు..!

మనిషి లక్షణాలకు దగ్గరగా ఉండే గ్రేట్ ఏప్స్‌కి మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు అధికారులు. కాలిఫోర్నియాలోని శాండియాగో జూలో ఉండే.. నాలుగు ఒరంగుటాన్లు, ఐదు బోనొబాస్ లకు… రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారు. మనుషులకు ఒకసారి ఒక డోస్ మాత్రమే ఇస్తారు. మరి వాటికి 2 డోసులు ఎందుకు ఇవ్వటమేంటీ అనే డౌట్ కూడా వస్తుంది. అలాగే మనుషులకు వేసే వ్యాక్సిన్..జంతువులకు వేసే వ్యాక్సిన ఒకలాంటివేనా? అనే డౌట్ కూడా వస్తుంది. వాటికోసం తయారుచేసిన వ్యాక్సిన్లు కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. జంతువుల కోసం వ్యాక్సిన్‌ని వెటెరినరీ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసింది. దీంతో ఈ తొమ్మిది జంతువులకు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి జంతువులుగా ఈ 9 జంతువులు రికార్డులకు ఎక్కాయి.

వాటికే ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడానికి బలమైన కారణం కూడా ఉంది. ఇదే జూలో వీటికి జూ సిబ్బంది వల్ల కరోనా వైరస్ సోకింది. జనవరిలో అవి కరోనా బారిన పడ్డాయి. ఈ అరుదైన ఏప్స్‌ని కాపాడుకునేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ వేశారు.

కాగా..వ్యాక్సిన్ వేయించుకున్న కొంతమంది చనిపోయారనే వార్తలు వస్తున్న క్రమంలో కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుంది? వస్తే ఇక ఏం భయంలేదు..చక్కగా వేయించుకోవచ్చని సంబరపడినంత సేపు లేదు వ్యాక్సిన్ వచ్చిన ఆనందం. దీంతో పలు అనుమానాలు వచ్చేసి చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా? వేయించుకుంటే ఏది బెటర్… ఏది ప్రమాదం? వంటి ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. ఇటువంటి గందరగోళాలన్ని కేవలం మనుషులకే ఉంటాయి. జంతువులకు ఉండవు..

అందుకే అవి చక్కగా వ్యాక్సిన్ వేయించుకున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. దేనికీ సైడ్ ఎఫెక్టులు రాలేదు. ఈ విషయాన్ని జూ అధికారులు తెలిపారు. జూలోని ఒరంగుటాన్లలో ఒక దాని పేరు కారెన్. దానికో ప్రత్యేకత ఉంది. అది 1994లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంది. అలా చేయించుకున్న తొలి జంతువు అదే.

ఇక్కడ మీకు మరో డౌట్ కూడా వస్తుంది. కరోనా సోకింది గొరిల్లాలకు కదా… మరి వాటికి ఎందుకు వ్యాక్సిన్ వెయ్యలేదు అని. గొరిల్లాల బాడీలో యాంటీ బాడీలు పెరిగాయట. దీంతో వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరమే లేకుండా పోయింది. అంటే కరోనా పప్పులు వాటిపై ఉడకలేదన్నమాట. ప్రస్తుతం జూ సిబ్బంది అంతా PPE కిట్లను వేసుకొనే జంతువుల సంరక్షణ చూస్తున్నారు. అయినా సరే ముందు జాగ్రత్తగా ఇలా ట్రయల్ బేస్ మీద వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇవి సక్సెస్ అయితే… ఇక మిగతా జంతువులకూ వ్యాక్సిన్ వచ్చేసినట్లే అనుకోవాలి.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే..గొరిల్లాలలో విన్‌స్టన్ అనే గొరిల్లా వృద్ధాప్యంలో ఉంది. దానికి కరోనా సోకాక… మరింత నీరసంగా అయిపోయింది. దీంతో ఇక అది చనిపోతుందనే అనుకున్నారు. దీంతో దాన్ని బతికించుకోవటం కోసం అప్పటికప్పుడే దాని కోసం సింథటిక్ యాంటీబాడీస్ తెచ్చి… దాని బాడీలో ప్రవేశపెటటారు. చిత్రమేంటంటే… అవి మనుషులకు ప్రవేశపెట్టే యాంటీబాడీలు కావు. ప్రత్యేకంగా తయారుచేశారట. అంటే జంతువుల కోసం కూడా వేగంగా ఇలాంటి తయారీలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఇక అమెరికా లాంటి దేశాల్లో జూలతోపాటూ… బయట అడవుల్లో తిరిగే జంతువులకు కూడా తరచూ రకరకాల వ్యాక్సిన్లు వేస్తూనే ఉంటారు. అది అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది.