వాట్ ఏ ఐడియా : మయన్మార్ లో ఆందోళనలు, రోడ్లపై మహిళల దుస్తులు

వాట్ ఏ ఐడియా : మయన్మార్ లో ఆందోళనలు, రోడ్లపై మహిళల దుస్తులు

protest

Myanmar protesters : మయన్మార్ లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా..ప్రజలు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని అడ్డుకొనేందుకు సైన్యం భారీగా మోహరిస్తోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో కొంతమంది చనిపోయారు. ఈ క్రమంలో..సైనికులు, పోలీసులు వీధుల్లోకి రాకుండా..సెంటిమెంట్ ను ప్రయోగించారు అక్కడి మహిళలు. వీధుల్లోనూ, రోడ్లపై అడ్డంగా తాళ్లు కట్టారు.

వాటిపై మహిళల దుస్తులు ఉన్నాయి. ఇలా ఎందుకు వేస్తున్నారు ? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. మహిళల దుస్తుల కింద నుంచి నడిస్తే..దురదృష్టం వెంటాడుతుందని మయన్మార్ దేశస్థుల నమ్మకం. ఇదే సెంటిమెంట్ ను మహిళలు ప్రయోగించారు. పోలీసులు లేదా సైన్యం వాటి కింద నుంచి నడిచేందుకు సాహసం చూపించరు. ఒక విధంగా..వారిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రోడ్లపై ఆరేస్తున్న దుస్తుల్లో లోంగ్యీ (మహిళలు నడుముకు చట్టుకొనేది)తో పాటు లో దుస్తులు కూడా ఉన్నాయి. లోంగ్యీ కింద నుంచి నడిస్తే..అదృష్టం కోల్పోయి..దురదృష్టం వెంటాడుతుందని అక్కడి సంప్రదాయ నమ్మకం. అందుకే వాటిని వీధుల్లో ఆరేస్తున్నట్లు సైన్యానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపడుతున్న నిరసనకారులు వెల్లడిస్తున్నారు.

అయితే..ప్రస్తుతం యూత్ దీనిని నమ్మకున్న..సైన్యం మాత్రం నమ్ముతుందని అది వారి బలహీనతని అంటున్నారు. ముందుకు రావాలని అనుకుంటే..వారికి కొంత సమయం పడుతుందని..ఈ పరిస్థితుల్లో తాము తప్పించుకొనేందుకు పనికొస్తుందని మయన్మార్ వాసులు అంటున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరసన కొనసాగుతోంది. ఆందోళనకారులను అణిచివేసేందుకు జుంటా(ఆర్మీ) కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. సైన్యం ఆదేశాలు పాటించలేన వారు సైతం వలస వెళ్లిపోతున్నారు. జుంటా అరాచకాలను ఎదిరిస్తూ..మరికొంతమంది పోరాడుతున్నారు. రాజధాని యాంగాంగ్‌తో సహా అన్ని నగరాల్లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియచేస్తున్నారు.