బ్రేకులో ప్రాబ్లం : 7వేల బుల్లెట్లను వెనక్కి పిలిచిన ఎన్ ఫీల్డ్

ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ తన వాహన శ్రేణిలోని దాదాపు 7వేల బుల్లెట్‌ బైక్ లను వెనక్కు రప్పించింది.

  • Published By: venkaiahnaidu ,Published On : May 8, 2019 / 01:32 AM IST
బ్రేకులో ప్రాబ్లం : 7వేల బుల్లెట్లను వెనక్కి పిలిచిన ఎన్ ఫీల్డ్

ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ తన వాహన శ్రేణిలోని దాదాపు 7వేల బుల్లెట్‌ బైక్ లను వెనక్కు రప్పించింది.

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌‌ఫీల్డ్‌ తన వాహన శ్రేణిలోని దాదాపు 7వేల బుల్లెట్‌ బైక్‌లను వెనక్కు రప్పించింది. బ్రేకింగ్ వ్యవస్థలో లోపాలు ఉండటంతో ఆ వాహనాలను వెనక్కి పిలిపించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్థుతం రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 3 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

బుల్లెట్ 500, బుల్లెట్ 350, బుల్లెట్ 350EC లు మార్కెట్ లో ఉన్నాయి. మార్చి 20, 2019 నుంచి ఏప్రిల్‌ 30, 2019 మధ్య తయారైన బుల్లెట్ వాహనాల్లో బ్రేక్‌ కాలిపర్‌ బోల్ట్‌ సరిగా పనిచేయక పోవడంతో సమస్య తలెత్తినట్లు గుర్తించామని రాయల్‌ ఎన్‌‌ఫీల్డ్‌ తెలిపింది.

సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా బ్రేక్‌ కాలిపర్‌ బోల్ట్స్‌ లేకపోవడంతో సమస్య ఉన్న బులెట్లను స్వచ్ఛందంగా సర్వీస్‌ చేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.