Rajaiah Thatikonda : కడియం శ్రీహరి కులంపై సీఎం రేవంత్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి- రాజయ్య

కడియం కావ్యను అడుగుతున్నా.. చిత్తశుద్ధి ఉంటే నీ తండ్రి, పెదనాన్నల డీఎన్ఏలు పరీక్ష చేయించు.

Rajaiah Thatikonda : కడియం శ్రీహరి కులంపై సీఎం రేవంత్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి- రాజయ్య

Rajaiah Thatikonda

Updated On : April 30, 2024 / 3:44 PM IST

Rajaiah Thatikonda : ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబం త్వరలో శాశ్వత రాజకీయ సమాధి కాబోతోందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆ సమాధి కోసం ప్రజలు రాళ్ళు తయారు చేస్తున్నారని చెప్పారు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి.. దళిత ద్రోహి.. నకిలీ దళితుడు.. అంటూ విరుచుకుపడ్డారు. కడియం కులంపై సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. అమాయకులను ఎన్ కౌంటర్ చేయించిన చరిత్ర కడియం శ్రీహరిది అని తీవ్ర ఆరోపణలు చేశారు.

”కడియం కావ్యను అడుగుతున్నా.. చిత్తశుద్ధి ఉంటే నీ తండ్రి, పెదనాన్నల డీఎన్ఏలు పరీక్ష చేయించు. అబద్దాల పుట్ట మీద కడియం జీవిస్తున్నారు. నైతిక విలువలు.. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా చూసుకుందాం.. ఎమ్మెల్యే కాక ముందు నీ ఆస్తులెంత? ఇప్పుడు నీ ఆస్తులెంతో చెప్పాలి. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారు. విదేశాల్లో బిడ్డ, అల్లుడు హవాలా ద్వారా ఆస్తులు కొనడం నిజం కాదా?” అని ప్రశ్నించారు రాజయ్య.

Also Read : నా ఫేక్ వీడియో వెనుక ఆయన హస్తం ఉంది: అమిత్ షా