లోకల్ హాలిడేస్ : గ్రామ, సచివాలయ పరీక్షలు 

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 01:46 AM IST
లోకల్ హాలిడేస్ : గ్రామ, సచివాలయ పరీక్షలు 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల సందర్భంగా సెప్టెంబర్‌ 3, 4, 6, 7 తేదీల్లో లోకల్‌ హాలిడేస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 26వేల 728 పోస్టులను భర్తీ చేయబోతోంది. వీటి కోసం దాదాపు 21 లక్షల 69వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది.  దీంతో వచ్చేనెల ఫస్ట్‌ నుంచి 8వ తేదీలోపు ఈ నియామక ప్రక్రియ కొనసాగనుంది.
13 జిల్లాల పరిధిలో మొత్తం 6 వేల 163 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.

రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
పరీక్ష రోజు సాయంత్రమే కీ రిలీజ్ చేస్తారు. 
కీ పై అభ్యంతరాలకు మూడు రోజుల పాటు అవకాశం.
అభ్యంతరాల పరీశీలన తర్వాత ఫైనల్ కీ విడుదల.
సెప్టెంబర్ 16న రాత పరీక్ష మెరిట్ జాబితా విడుదల.
సెప్టెంబర్ 20 వరకు సర్టిఫికేట్ల పరిశీలన.
సెప్టెంబర్ 26న తుది నియామక ఫలితాల ప్రకటన.
Read More : పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు