ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు కంట్రోల్‌లో పెట్టుకోవాలి

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. RDX Love.. టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 04:44 AM IST
ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు కంట్రోల్‌లో పెట్టుకోవాలి

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. RDX Love.. టీజర్ రిలీజ్..

ఆర్ఎక్స్ 100 తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్, హుషారు ఫేమ్, తేజస్ కంచెర్ల జంటగా, G.రామ్ మునీష్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై.. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. RDX Love.. శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముమైత్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి.. తప్పదూ అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి’.. అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన టీజర్ యూత్‌ మెచ్చే, యూత్‌కి నచ్చే రొమాంటిక్ అండ్ బోల్డ్ షాట్స్‌తో నిండిపోయింది. టీజర్‌లో సేఫ్టీల టాపిక్కే ఎక్కువగా కనిపించింది. తేజస్, పాయల్ కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంది. తాతకు దగ్గులు ఆర్ఎక్స్ 100 భామ రొమాన్సూ నేర్పడం కష్టం.. ఎందుకంటే రొమాంటిక్ సీన్స్‌లో తేజస్ కంటే ఇరగదీసేసింది పాయల్. ‘సేఫ్టీ ఈజ్ నాట్ గ్యారంటీడ్’ అని చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేశారు.

Read Also : జూదం ఆడితే జీవితాలు సర్వ నాశనమైపోతాయ్..

టీజర్ చివర్లో రొమాన్స్ చేస్తుండగా పాయల్ కంట్లోనుండి నీళ్లు రావడం, మంచం విరగడం వంటి షాట్స్ బాగున్నాయి. సి.రామ్ ప్రసాద్ విజువల్స్, రథన్ ఆర్ఆర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.. నరేష్, నాగినీడు, ఆదిత్య మీనన్, తులసి, ఆమని, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఆర్డీఎక్స్ లవ్ సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. సంగీతం : రథన్, కెమెరా : C.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, కో-ప్రొడ్యూసర్ : సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిన్నా.