Asthma : ఆస్తమాతో బాధపడేవారు… ఉపశమనం కోసం ఇలా చేయండి.

ఆస్తమాకు వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించటంతోపాటు వారు సూచించిన విధంగా క్రమం తప్పకుండా మందులను వాడుతూ పోషకాహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Asthma : ఆస్తమాతో బాధపడేవారు… ఉపశమనం కోసం ఇలా చేయండి.

Dcim/100media/dji 0098.jpg

Asthma : ఉబ్బసం, ఆస్తమాతో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 23.5కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. భారత దేశంలో ఈ సంఖ్య 2కోట్లు ఉంటుందని అంచనా.. దీని భారిన పడుతున్న వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో ఆస్తమా బారిన పడుతున్నచిన్నారుల సంఖ్య బాగా పెరుగుతుంది.

శ్వాస సంబంధమైన వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. ఒకసారి దీని భారిన పడితే దీర్ఘకాలంపాటు వేధిస్తుంది. ఊపిరితిత్తుల్లోకి మనం పీల్చే గాలి వెళ్ళటానికి, తిరిగి బయటకు వచ్చేందుకు వాయునాళాలు ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఆ వాయునాళాల కండరాలు సన్నబడటం , వాచిపోవటం జరుగుతాయి. ఈ కారణంగా గాలి పీల్చటం, వదలటంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

ఆస్తమాకు వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించటంతోపాటు వారు సూచించిన విధంగా క్రమం తప్పకుండా మందులను వాడుతూ పోషకాహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీటికి తోడు చిన్నచిన్న చిట్కాలను పాటించటం ద్వారా ఆస్తమాను తగ్గించుకోవచ్చు. మనం నిత్యం కూరల్లో వాడే వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ఔషద గుణాలు ఉన్నాయి. వీటిల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణం ఆస్తమాను తగ్గిస్తాయి. రోజు ఆహారంలో పచ్చి ఉల్లిపాయలను 50 గ్రాముల మోతాదులో తీసుకోవటం, ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి , చిన్నుల్లి కప్పుమోతాదులో నీటిలో మరగించి తాగాలి.

పసుపు ఆస్తమాకు చక్కని చిట్కాగా పనిచేస్తుంది. ఇందులో కర్కుమిన్ సమ్మేళనం ఆస్తమాను తగ్గించటం లో సహాయకారిగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు గ్లాసు గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే చక్కని ప్రయోజనం ఉంటుంది. పరగడుపున కొద్దిగా పసుపు వేసి వేడిచేసిన నీటిని తాగటం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.విటమిన్ డి, విటమిన్ సి లు లభించే పుట్టగొడుగులు, కోడిగుడ్డు, పాలు, పెరుగు, ఉసిరి, నారింజ, నిమ్మ, కివీ, బొప్పాయి, టమాటా వంటి ఆహారం తీసుకుంటే ఆస్తమా నుండి ఊరట కలుగుతుంది.

చిన్నవయస్సు పిల్లల్లో ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో ఎక్కవగా ఆస్తమా సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పలు అద్యయనాల్లో తేలింది. ఆస్తమా, చర్మవ్యాధులకు కారణమయ్యే బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ ల వంటి పదార్ధాలను వారు తినేందుకు ఇవ్వకపోవటమే మంచిది.