10టీవీ ఎఫెక్ట్ : మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ కేసుపై స్పందించిన సబ్‌ కలెక్టర్‌

10టీవీ కథనాలకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. చిన్నారి సుహానా మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ కేసుపై మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : October 11, 2019 / 01:38 PM IST
10టీవీ ఎఫెక్ట్ : మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ కేసుపై స్పందించిన సబ్‌ కలెక్టర్‌

10టీవీ కథనాలకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. చిన్నారి సుహానా మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ కేసుపై మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి స్పందించారు.

10టీవీ కథనాలకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. చిన్నారి సుహానా మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ కేసుపై మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి స్పందించారు. పాప ఆరోగ్య సమస్య, వైద్య ఖర్చుల వివరాలు పంపాలని మదనపల్లె ఎమ్మార్వోను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు సబ్‌కలెక్టర్‌ హామీ ఇచ్చారు. సబ్‌కలెక్టర్‌ ఆదేశాలతో.. పాప తల్లిదండ్రులు బావజాన్‌, షబ్నా నుంచి వివరాలు సేకరించారు మదనపల్లె తహశీల్దార్‌.  

చిత్తూరు జిల్లాకు చెందిన భావజాన్, షబీర్ లకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంవత్సరం వయసు గల సుహాన అనే కుమార్తె ఉంది. కుమార్తె పుట్టినప్పటి నుంచి శ్వాసకోస సమస్యతో బాధపడుతోంది. దంపతులు తమకు ఉన్న ఎకరం పొలం అమ్మి చిన్నారి చికిత్స కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారు. అంత ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. చిన్నారి చికిత్స కోసం ఇంకా ఖర్చు చేయాల్సివుంది. తమ దగ్గర ఉన్నదంతా ఇప్పటికే ఖర్చు చేశారు. చికిత్స చేయించేందుకు వారి దగ్గర ఏమీ మిగలలేదు. 

దీంతో దంపతులు మదనపల్లిలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెకు చికిత్స చేయించే స్తోమత లేదని…చిన్నారిని చంపేయాలనుకుంటున్నామని…అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. చికిత్స చేయించలేకపోతే ఎలాగూ తమ కూతురు చనిపోతుందని తెలిపారు. వ్యాధితో కుమార్తె రోజూ ప్రాణాలతో పోరాడటం తాము చూడలేకపోతున్నామని తెలిపారు.