KGF2: చాప్టర్-3 స్టార్ట్ అయ్యేది అప్పుడే..?
కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్-2 చిత్రం కోసం ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తొలి భాగమైన ‘కేజీయఫ్ చాప్టర్ 1’....
KGF2: కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్-2 చిత్రం కోసం ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తొలి భాగమైన ‘కేజీయఫ్ చాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే, ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులను అంత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. ఇక ‘కేజీయఫ్ 2’ సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. తొలి ఆటకే బొమ్మ బ్లాక్‌బస్టర్ అనే టాక్ బయటకు రావడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎగబడుతున్నారు.
KGF2 Movie Review: కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ..!
కాగా ఈ సినిమాను ఆద్యంతం యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా హీరోను ఎలివేట్ చేసిన విధానం వారికి గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయని అంటున్నారు. అయితే కేజీయఫ్ 2 సినిమా క్లైమాక్స్‌లో ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు. ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుందని క్లూ ఇచ్చేశాడు దర్శకుడు. దీంతో కేజీయఫ్ 2 రిలీజ్ రోజునే కేజీయఫ్-3 గురించి చర్చ సాగుతోంది.
కేజీయఫ్ 2 సినిమాపై ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గుకుండా సినిమాను తెరకెక్కించి సక్సెస్ అయిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు కేజీయఫ్ చాప్టర్ 3 కూడా ఉందని తెలపడంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరిలో అప్పుడే ఆసక్తి మొదలైంది. అయితే కేజీయఫ్ చాప్టర్ 3 మాత్రం ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా మిగతా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ఆ తరువాత ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఈ డైరెక్టర్.
KGF2: రాఖీ భాయ్ దెబ్బకు ‘బీస్ట్’ ఖతం..?
అటు హీరో యశ్ కూడా పలు కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. దీంతో వీరిద్దరు తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లకుపైగా సమయం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అంటే.. కేజీయఫ్-3 కథ రెడీగా ఉన్నా కూడా, ఈ సినిమా పట్టాలెక్కాలంటే కనీసం రెండేళ్లకుపైగా సమయం ఖచ్చితంగా పడుతుంది. మరి రెండేళ్ల తరువాత పట్టాలెక్కితే, కేజీయఫ్ చాప్టర్ 3 ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో, ఎప్పటికి రిలీజ్ అవుతుందో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.