Raviteja: చిరు సినిమాలో రవితేజ పాత్ర అలా ఉంటుందా..?
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా,....
Raviteja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రాక్షసుడు సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ, మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ను కూడా స్టార్ట్ చేశాడు. ఇలా వరుసబెట్టి సినిమాలను చేస్తున్న రవితేజ, మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో కూడా భాగం కానున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో రవితేజ ఓ కేమియో రోల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Raviteja: పాతిక రోజులకు అంత రేటా..?
దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో రవితేజ పాత్ర సెకండాఫ్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో రవితేజ పాత్ర మనకు కనిపిస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తాడని.. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!
అయితే ఈ సినిమాలో రవితేజ చనిపోతాడని.. అతడి మరణం తరువాత చిరంజీవి పాత్రలో చాలా మార్పు వస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే రవితేజ ఈ సినిమాలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించగా, ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.