Raviteja: పాతిక రోజులకు అంత రేటా..?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాల జోరు పెంచారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుసగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

Raviteja: పాతిక రోజులకు అంత రేటా..?

Raviteja Charging Huge For 25 Days

Raviteja: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాల జోరు పెంచారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుసగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇప్పటికే తన 152వ సినిమా అయిన ‘ఆచార్య’ను ముగించుకుని రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను ఈ వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టి దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో.

Raviteja : రోజువారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రవితేజ.. రోజుకి ఎంతో తెలుసా??

ఇప్పటికే తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘భోళాశంకర్’, చిత్రాల షూటింగ్ జరుపుకుంటున్న చిరు, ఆ తరువాత మరో యంగ్ డైరెక్టర్ కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తాడనే వార్త వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో రవితేజ చేయబోయే పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక బాబీ చెప్పిన పాత్ర తనకు నచ్చడంతో రవితేజ కూడా వెంటనే ఈ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడట. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించేందుకు మాస్ రవితజే భారీగానే వసూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ చేయబోయే పాత్ర కోసం ఏకంగా 20 నుంచి 25 రోజుల షూటింగ్ జరుపుకోవాల్సి ఉందట.

Raviteja : నేను జాతకాన్ని నమ్మను.. సినిమా నాకు నచ్చితే మీకు నచ్చినట్టే..

దీంతో మొత్తంగా 25 రోజుల కోసం రవితేజ రూ.10 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట. సాధారణంగా రవితేజ చేసే ఒక్కో సినిమాకు రూ.17 కోట్ల నుండి రూ.18 కోట్లు వసూలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కేవలం ఓ కేమియో రోల్ లో నటించేందుకే ఇంత భారీ మొత్తంలో రవితేజ రెమ్యునరేషన్ పుచ్చుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి వాల్తేరు వీరయ్యలో రవితేజ చేయబోయే ఈ కేమియో పాత్ర ఎలాంటి ముద్రను వేసుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.